SKLM: నరసన్నపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులుగా నియమితులైన సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేపట్టారు. సోమవారం స్థానిక ఆలయంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సమక్షంలో ఆలయ ఈవో మాధవి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి సభ్యులు అన్ని విధాల కృషి చేయాలని సూచించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత పెరగాలన్నారు.