కోనసీమ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడంతో ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలకు తాను దూరంగా ఉంటున్నట్లు ఏఐసీసీ సభ్యులు, మండపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కామన ప్రభాకరరావు పేర్కొన్నారు. మన్మోహన్ పట్ల ఉన్న గౌరవంతో నూతన సంవత్సర- 2025 వేడుకలను నిర్వహించట్లేదన్నారు. ఈ సందర్భంగా జనవరి 1న తనను కలవడానికి ఎవరూ రావొద్దని ఆదివారం విజ్ఞప్తి చేశారు.