W.G: జిల్లాలో సంక్రాంతి సంబరాలలో భాగంగా కోడిపందేలు, గుండాట, జూదం వంటివి జోరుగా సాగాయి. అయితే వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కోడిపందేలు నిర్వహిస్తున్న 545 మందిని అరెస్ట్ చేసి, 245 కేసులు నమోదు చేశారు. పేకాడుతున్న 189 మందిని అరెస్ట్ చేసి 103 కేసులు నమోదు చేశారు. వాటితో పాటు గుండాట ఆడిన 236 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.