అన్నమయ్య: ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం పోలీసుల ప్రధాన బాధ్యతేనని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల వేదికలో ఆయన స్వయంగా హాజరై భూవివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, మహిళలపై వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి అర్జీపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.