SKLM: కవిటి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఎంపీపీ కడియాల పద్మ అధ్యక్షతన మండలపరిషత్ పాలకవర్గ సాధారణ సమావేశం నిర్వహించనున్నట్టు ఎంపీడీవో కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సర ఆదాయ, వ్యయాలకు సంబంధించిన సవరణ బడ్జెట్, 2025-26 అంచనా బడ్జెట్లను ఆమోదానికి సంబంధించి చర్చించనున్నట్లు తెలిపారు.