ఎన్టీఆర్: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ ఈనెల 30న విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ వద్ద తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ ఇబ్రహీంపట్నం కార్యదర్శి ఎం.మహేష్ డిమాండ్ చేశారు. గురువారం కొండపల్లి వీటీపీఎస్ మెయిన్ గేట్ వద్ద కరపత్రాలు పంపిణీ చేశారు. వీటీపీఎస్‌లో కాంట్రాక్ట్ పీస్ రేట్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు.