ATP: ఆర్డీటీ జిల్లాలో కుల, మతాలకు అతీతంగా సేవలు అందిస్తోందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లడుతూ.. కేంద్ర ప్రభుత్వం FCRA రెన్యువల్ చేయకపోవడంతో ఆర్డీటీ మూతపడుతుందన్న భయాందోళన ప్రజల్లో ఉందని తెలిపారు. ఆర్డీటీ పరిరక్షణకు ప్రజా ఉద్యమం చేపడతామని తెలిపారు.