VZM: గజపతినగరం మండలంలోని రామన్నపేట గ్రామంలో గురువారం గజపతినగరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ జె జనార్ధన రావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మద్యం సీసాలతో లక్ష్మయ్య అనే వ్యక్తి పట్టుబడినట్లు తెలిపారు. ఈమేరకు సీసాలు స్వాధీనం చేసుకుని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇందులో ఎస్సై శాంతి లక్ష్మి, హెచ్.సీలు భాష లోకాభి కానిస్టేబుల్ గంగాధరుడు పాల్గొన్నారు.