ప్రకాశం: ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ మూల్యాంకనం గురువారం స్థానిక డీఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ డి. కళ్యాణి తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలయ్యే మూల్యాంకనానికి డ్యూటీ ఆర్డర్లు పొందిన అధ్యాపకులంతా హాజరుకావాలన్నారు.