ప్రకాశం: పెదచెర్లోపల్లి మండలంలోని మురుగమ్మిలో జరిగిన దాడి కేసులో ఇద్దరికీ జైలు శిక్ష విధించినట్లు ఎస్సై కోటయ్య తెలిపారు. గ్రామానికి చెందిన వెంగల్ రెడ్డి, శబరి కంఠారెడ్డి పై ఈనెల 13న వల్లెం రాజశేఖర్ రెడ్డి, అతని భార్య రాజ్యలక్ష్మి దాడి చేశారన్నారు. మెజిస్ట్రేట్ ముందు ఇద్దరినీ హాజరు పరచగా కనిగిరి జడ్జి భరత్ చంద్ర ముద్దాయిలిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించారు.