KDP: జమ్మలమడుగు మండలం భీమరాయుని కొట్టాల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని వైసీపీ నాయకులతో స్థానిక సమస్యలపై చర్చించారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.