PPM: సీతానగరం సువర్ణ ముఖి నదిలో బుధవారం ఇసుక పడుతున్న సమయంలో వరద రావటంతో నాటు బండి, ఎడ్లు వరదలో కొట్టుకు పోయాయి. బండి యజమాని సామంతుల శ్రీను ప్రాణాలతో బయటపడ్డాడు. లక్షా 80వేల విలువచేసే జత ఎడ్లు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే ప్రభుత్వం తనని ఆదుకోవాలని కోరాడు.