ELR: భీమవరం పట్టణంలోని చింతలపాటి బాపిరాజు హైస్కూల్లో బాలోత్సవం కార్యక్రమం రెండవ రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని విద్యార్థుల ప్రదర్శన తిలకించారు. అనంతరం MLA మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనడం వల్ల సృజనాత్మకత మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.