E.G: అల్లవరం మండలం, ఓడలరేవు గ్రామంలో వైసీపీ శ్రేణులు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అమలాపురం వైసీపీ పినిపే శ్రీకాంత్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీ ప్రవేట్కరణ ద్వారా పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాన్ని విరమించుకోవాలని అన్నారు.