ELR: పోలవరం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అరోపించారు. శనివారం పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు వచ్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రానికి చేకూర్చే ప్రయోజనాలను కమిటీ సభ్యులకు మంత్రి వివరించారు.