GNTR: జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ ఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి వడ్డే ఓబన్న విశేష కృషి చేసి తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం విరోచితంగా పోరాడారన్నారు.