కోనసీమ: కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలం వెదురుమూడిలో NREGS కంపోనెంట్ నిధులు రూ. 25 లక్షలతో పల్లె పండుగ పథకంలో బాగంగా అభివృద్ధి చేసిన సీసీరోడ్డు, గోకులాలను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. వైసీపీ పాలనలో బటన్ నొక్కడుకే పరిమితమై ఆంధ్రప్రదేశ్‌ను రుణాంద్రప్రదేశ్ చేశారన్నారు.