VZM: జనవరి 5న గన్నవరంలో జరగనున్న హైందవ శంఖారావం సభకు హాజరు కావాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనకు ఆదివారం RSS నాయకులు జనార్దన్, రాజశేఖర్, రమణమూర్తి ఆహ్వాన పత్రికను ఇచ్చి ఆహ్వానించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న శంఖారావం సభ హిందు ధర్మాన్ని కాపాడేందుకు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా RSS నాయకులు తెలిపారు.