సత్యసాయి: పుట్టపర్తిలోని సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ‘సాయి ఫ్రూడెంట్ స్కాలర్షిప్ టెస్ట్’కు విద్యార్థుల నుంచి అద్భుత స్పందన లభించింది. కర్నూలు, చిత్తూరు, కాకినాడ సహా పలు జిల్లాల నుంచి 4,300 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారని ప్రిన్సిపల్ హేమచంద్ర తెలిపారు. అర్హత సాధించిన వారికి ఉచిత హాస్టల్, విద్య అందిస్తామని ప్రకటించారు.