KRNL: రైతు సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ మేరకు పెట్టుబడి సాయం, క్రాఫ్ట్ ఇన్సూరెన్స్, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పల పాలవుతున్నారని అన్నారు. ఈ నెల 9న ఆర్డీవో కార్యాలయాల వద్ద రైతులతో కలిసి ధర్నాలు చేస్తున్నామన్నారు.