కోనసీమ: ఉప్పలగుప్తం మండలం సూరసేన యానాం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఇక్కడి బీచ్లో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో గురువారం నాలుగో రోజు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.