KDP: కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తానని వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మదిన దస్తగిరి తెలిపారు. వైసీపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. తన పైన నమ్మకం ఉంచి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినందుకు జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.