NDL: మద్దిలేటి మండల పరిధిలోని రంగాపురం శివారులో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని హంపి పీఠాధిపతి శ్రీ విరుపాక్షి విద్యారణ్య భారతి స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ వేద పండితులు, సిబ్బంది పూర్ణకుంభంతో, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.