CTR: పత్రికల్లో, యూట్యూబ్ ఛానల్లో తనపై, తన వ్యక్తిగత సహాయకులపై వస్తున్న కథనాలపై ఎమ్మెల్యే థామస్ శుక్రవారం స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. గంగాధర నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమంపై కృషి చేస్తున్న తనపై తన వ్యక్తిగత సహాయకులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు, ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.