బాపట్ల: పట్టణంలో చీలు రోడ్డు సెంటర్ వద్ద ఆదివారం రాత్రి డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకొని జరిమానాలు విధించారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.