W.G: పోడూరు మండలం కొమ్ముచిక్కాల టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆదివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని మాజీ సీఎం జగన్ అసత్య ఆరోపణలు చేయటం దారుణమన్నారు. వైసీపీ పాలనలో 8సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని.. కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు.