CTR: గుడిపాల మండల పరిధిలోని సీఎంసీ ఆసుపత్రి సమీపంలో షేర్ ఆటోను ఓ వ్యాన్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పల్లూరు AAW గ్రామానికి చెందిన శ్రీలేఖ తీవ్రంగా గాయపడింది. ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్రమాదంలో బుజ్జి అనే మరొకరు కూడా గాయపడ్డారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.