PPM: భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి, ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం గుమ్మలక్ష్మి పురం మండలంలోని భద్రగిరి సీహెచ్సీ నూతన భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భద్రగిరి ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అన్నారు.

