NDL: రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద సోమవారం నాడు ధర్నా చేపట్టారు. రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతులు ధర్నా చేస్తుండడంతో పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను బలవంతంగా బయటకు పంపించారు. రైతులు పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీ ప్రతినిధులు రైతులతో చర్చిస్తున్నారు.