సత్యసాయి: లేపాక్షి మండలంలో హంద్రీనీవా కాలవ ద్వారా కృష్ణా జలాలు చేరడంతో పులమతి చెరువు నిండిమరువుతోంది. చెరువు పూర్తిగా నీటితో కళకళలాడుతూ రైతులకు ఆనందాన్ని ఇస్తోంది. సాగునీటి లభ్యత పెరగడంతో పంటలకు ఉపయోగం కలుగుతుందని రైతులు తెలిపారు. భూగర్భ జలాలు పెరిగి గ్రామంలో తాగునీటి సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.