KDP: మైలవరం మండల పరిధిలోని వద్దిరాల సుంకులమ్మ పరంజ్యోతి అమ్మవారి మహోత్సవం సందర్భంగా వృషభ రాజుల బండలాగుడు పోటీలను జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఉగాది తిరుణాల సందర్భంగా బండలాగుడు పోటీలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ పోటీలలో రాష్ట్రం నలుమూలల నుండి వృషభరాజ్యంలో పోటీలలో పాల్గొన్నాయి.