VSP: ఎస్.హెచ్.జీ గ్రూపులు ఆర్థికంగా బలోపేతం కావాలని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ సూచించారు. ఆదివారం విశాఖ ఎంవీపీ కాలనీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా మేళాను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా సంఘాలు స్వయం సమృద్ధి సాధించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మేళాలో స్టాల్స్‌ను సందర్శించిన ఆయన ఉత్పత్తులను పరిశీలించారు.