NDL: పాములపాడు మండలం బానకచర్ల గ్రామం దగ్గర నిప్పుల వాగుపై ఉన్న కేసీ కెనాల్లో మరోసారి మొసలి ప్రత్యక్షమైంది. 5 రోజులుగా కేసీకెనాల్లో మొసలి సంచరిస్తోంది. ఇది గమనించిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు మొసలి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. దానిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు. మొసలిని పట్టుకునేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.