W.G: నిడదవోలు మండలం సమిశ్రగూడెంకు చెందిన వైద్య విద్యార్థిని ముప్పిడి ఆశ కీర్తిని ఘనంగా సత్కరించారు. గ్రామంలోని శాంతి సెంటర్లోని మదర్ తెరిసా విగ్రహం వద్ద బాబు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా క్రిస్మస్ సందర్భంగా ఆమెను సత్కరించారు. కార్యక్రమంలో క్రీస్తు గాన ప్రచారకులు ఉందుర్తి నాని, వై. విజయ్ కుమార్, బాబు ఫ్రెండ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.