KRNL: శ్రీశైలం దేవస్థానంలో రాయలసీమ రీజినల్కు చెందిన స్థానిక అర్చకులు వేద పండితులకే ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎంపీ శబరి పేర్కొన్నారు. శనివారం ఈ విషయంపై శ్రీశైలంలో సీఎంకు వినతిపత్రం అందజేశారు. శ్రీశైలం దేవస్థానంలో ఇతర ప్రాంతం వారి వల్ల స్థానిక రాయలసీమ రీజనల్ అర్చకులు, వేద పండితులకు అన్యాయం జరుగుతుందన్నారు.