ATP: కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అనివార్య కారణాలతో డిసెంబర్ 31న జన్మదిన వేడుకలు చేసుకోవడంలేదని ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ప్రకటన వెలువడింది. అలాగే జనవరి 1న స్థానిక ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారని పేర్కొంది. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే ప్రజలు బొకేలు, కేక్‌కు తీసుకురావొద్దని సూచించారు.