VZM: బాల్య వివాహాలపై గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్లో బాల్యవివాహాల నిర్మూలన పై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్లలోపు బాల బాలికలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, చిన్న వయసులో వివాహాల వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయన్నారు.