BPT: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో జిల్లాలో ఈనెల 29 నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కలెక్టర్ కార్యాలయం గురువారం ఓ మ్యాప్ విడుదల చేసింది. తుఫాన్ ప్రభావం వలన ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పంటల విషయంలో రైతులు జాగ్రత్త వహించాలని సూచించారు.