CTR: పుంగనూరు మండలం నక్కబండలోని రోడ్లపై మురుగునీరు పేరుకుపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఒక వీధి నుంచి మరొక వీధికి కాల్వల అనుసంధానం లేకపోవడంతో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో మురుగు నీరంతా రోడ్లపైనే ప్రవహించడంతో పాటు నిల్వ ఉండడం వలన దోమల బెడద ఎక్కువైనట్లు వారు తెలిపారు.