కడప: త్వరలోనే ఉమ్మడి జిల్లాలో సొరంగ మార్గం నిర్మించనున్నారు. కడప-చిత్తూరు హైవేలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో పలు వాహనాలు లోయలో పడి చాలామంది చనిపోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 6కిలోమీటర్ల మేర సొరంగ మార్గం నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నిన్న ఢిల్లీ నుంచి వచ్చిన చీఫ్ ఇంజినీర్ రాహుల్ గుప్తా పరిశీలించారు.