కృష్ణా: ప్రమాదాల అంచున ప్రయాణాలు సాగిస్తున్నారు ప్రజలు. ఘంటసాల మండలం దేవరకోట గ్రామం వద్ద ఉన్న గుండేరు పాత వంతెన ప్రమాదకరంగా మారింది. ఈ వంతెన శిథిలావస్థకు చేరడంతో అధికారులు నూతన వంతెన ఏర్పాటు చేసినప్పటికీ, అవేమీ పట్టించుకోకుండా వాహనదారులు ప్రయాణాలు సాగిస్తున్నారు. పాత వంతెన రెయిలింగ్స్ విరిగి ఏమాత్రం ఆదమరిచినా కాలువలో పడిపోయే పరిస్థితి నెలకొంది.