NDL: శ్రీశైలం మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలసంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఉచిత, సాధారణ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం ద్వారా గంటల తరబడి వేచిఉండి శ్రీభ్రమరాంబిక, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు.