కడప: మైదుకూరులో సోమవారం జరగాల్సిన స్వచ్చతాహిసేవ వైద్య శిబిరం కార్యక్రమనికి డాక్టర్లు డుమ్మ కొట్టారు. బీజేపీ నాయకులు వెళ్లి డాక్టర్ను వైద్య శిబిరానికి రావాలని విన్నవించిన శిబిరం వద్దకు రాలేదన్నారు. ప్రధానమంత్రి కార్యక్రమం కాబట్టి డుమ్మా కొట్టారని, సహకరించవలసిన పురపాలక శాఖ వారు కూడా మొహం చాటేసారని మైదుకూరు బీజేపీ నాయకులు బీవీ ప్రతాప్ రెడ్డి అన్నారు.