W.G: తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన కూటమి నాయకులు రూ.20వేలు విరాళాన్ని ముత్యాల సత్యనారాయణ ఆధ్వర్యంలో సమకూర్చారు. ఈ మొత్తం చెక్కును సోమవారం తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కు అందజేశారు. వరద బాధితుల సహాయార్థం తమ వంతు బాధ్యతగా అందజేస్తున్నట్లు తెలిపారు.