SKLM: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం శుక్రవారం శ్రీకాకుళం జిల్లాకు వస్తున్నట్లు కమిషన్ కార్యదర్శి ఎన్ పద్మజ ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్‌తో ఆయన ఛాంబర్లో జిల్లాలో నెలకొన్న వివిధ బాలల హక్కుల పరిరక్షణ, సమస్యలపై భేటీ కానున్నట్లు తెలిపారు. అనంతరం ఉదయం 11 గంటలకు జిల్లా ఎస్పీతో భేటీ అవుతారన్నారు.