GNTR: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్‌ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. విజయవాడకు చెందిన AP TPO’s అసోసియేషన్ ప్రతినిధులు రూ.2 లక్షల విరాళం అందజేశారు. విజయవాడకు చెందిన టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.1,13,216 విరాళం, విజయవాడకు చెందిన కేఎస్ నాగమణి రూ.50,116 విరాళం అందజేశారు.