KRNL: మంత్రి పేరుతో వేధింపులకు దిగడం కర్నూలులో కలకలం రేపింది. ట్రాఫిక్ పోలీస్ లైన్ మసీదుకు సంబంధించి కొన్ని దుకాణాలు ఉన్నాయి. ఇందులో వ్యాపారం చేస్తున్న పలువురిని మంత్రి TG భరత్ పేరు చెప్పి ఎక్కువ అద్దె ఇవ్వాలని వేధిస్తున్నారు. బాధితులు CMకు లేఖ రాయగా.. విచారణ చేపట్టాలని కర్నూలు కార్పొరేషన్ కమిషనర్‌కు ఆదేశాలు వచ్చాయి.