NDL: గడిగరేవులలో కొలువై దక్షిణ కాశీగా పేరుపొందిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఆరుద్రాష్టమి పురస్కరించుకుని శ్రీ దుర్గా భోగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు ఉంటాయని ఆలయ ప్రధాన అర్చకులు శ్యాంసుందర్ శర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ అష్టమి తిధి కూడిన ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, రుద్రహవనం, నిర్వహిస్తామన్నారు.