బాపట్ల: డివిజనల్ రెవెన్యూ అధికారిని గా పి. గ్లోరియా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. చిత్తూరు జిల్లా పరిషత్ సీఈఓగా పని చేస్తూ గురువారం జరిగిన బదిలీలలో భాగంగా బాపట్ల ఆర్డిఓగా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ జే. వెంకట మురళిని మర్యాదపూర్వకంగా కలసి బొకేెను అందజేశారు. రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరువు చేసేందుకు కృషి చేయాలని అన్నారు.