తూ.గో: తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను శిక్షించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రిలో నిరసన కార్యక్రమం చేపట్టి జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ తయారీలో నాణ్యత పాటించకుండా జంతుల కొవ్వు కలిపిన నెయ్యి వాడినట్లు రిపోర్టులు రావడం బాధాకరమన్నారు.